కాంప్రమైజ్ అయితే లైంగిక వేధింపుల కేసు కొట్టేస్తారా ?

కాంప్రమైజ్ అయితే లైంగిక వేధింపుల కేసు కొట్టేస్తారా ?
  • రాజస్థాన్ హైకోర్టుపై సుప్రీం ఫైర్

న్యూఢిల్లీ: పిటిషనర్, నిందితుడికి మధ్య రాజీ కుదిరినంత మాత్రాన లైంగిక వేధింపుల కేసును కొట్టేవేయలేమని సుప్రీం కోర్టు తెలిపింది. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఫైర్ అయింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. గవర్నమెంట్ స్కూల్ టీచర్ విమల్ కుమార్ గుప్తా తనను లైంగికంగా వేధించాడని రాజస్థాన్‌లో 2022లో  ఓ బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు పెట్టి, బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

కానీ, ఆమె కుటుంబం మాత్రం విమల్ కుమార్​కు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా కింది కోర్టులో  పోలీసులు రిపోర్టు సమర్పించారు. దానిని కోర్టు తిరస్కరించడంతో నిందితుడు హైకోర్టుకు వెళ్లాడు. బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని అంగీకరించిన హైకోర్టు... ఎఫ్ఎఆర్ ను రద్దు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పును ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాలు చేయగా, గురువారం విచారించిన ధర్మాసనం హైకోర్టు తీర్పును రద్దు చేసింది.